ధోని ఇంటికి చేరుకున్న రిటైర్మెంట్‌ గిఫ్ట్‌

MS Dhoni Retirement Gift Reached Home - Sakshi

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలసిందే. దీంతో క్రీడల్లో  అద్భుతమైన శకం ముగిసింది.  ఇక నుంచి ధోని జెర్సీని చూసే అవకాశాన్ని ఆయన అభిమానులు కోల్పోనున్నారు. అయితే ధోని తన రిటైర్‌మెంట్‌ను ఒక అద్భుతమైన గిఫ్ట్‌తో జరుపుకున్నట్లు తెలుస్తోంది. పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్‌తో ధోని తన రిటైర్‌మెంట్‌ను గొప్పగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దానికి సంబంధిన ఫోటోలను, వీడియోను షేర్‌ చేశారు.  డ్యూయల్ రేసింగ్ గీతలతో ఎరుపు రంగుతో ఉన్న ట్రాన్స్ యామ్ ధోని కార్‌ గ్యారేజీలో అద్భుతంగా కనిపిస్తోంది. 

Welcome home ! @mahi7781 missing you ...#transam

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ 1970 లలో తయారు చేసిన ఒక అమెరికన్ కారు. ఇది భారతదేశంలో దొరకడం చాలా అరుదు.  ధోని కారు 1971-1973 మధ్య తయారు చేసిన ప్రారంభ మోడల్‌గా కనిపిస్తుంది. ఈ కారు V8 బిగ్ బ్లాక్ ఇంజిన్ 455 ఇంజిన్‌తో నడిచే లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను కలిగి ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కారు ధోని వద్దకు చేరుకుంది. ఈ వీడియోలో  ట్రాన్స్ యామ్ కాకుండా, ధోని గ్యారేజీలో ఉన్న మరిన్ని కార్లను కూడా చూడవచ్చు. ఇందులో హమ్మర్ హెచ్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ అలాగే రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1, మిత్సుబిషి పజెరో ఎస్‌ఎఫ్‌ఎక్స్ , పాత తరం టయోటా కరోలాతో సహా మరిన్ని వాహనాలను కూడా చూడవచ్చు. వీటితో పాటు మొదటి తరం ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక ఈ కార్లతో పాటు మాహీకి బైక్స్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గర  కాన్ఫెడరేట్ ఎక్స్‌ 132 హెల్కాట్, కవాసాకి నింజా హెచ్ 2, డుకాటీ 1098, యమహా ఆర్డి 350, రాయల్ ఎన్ఫీల్డ్ మాచిస్మో, సుజుకి షోగన్, యమహా వైజెడ్ఎఫ్ 600 ఆర్, బిఎస్ఎ గోల్డ్‌స్టార్‌తో సహా మరిన్ని మోటర్‌ బైక్‌లు కలవు. ఇక ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెఫ్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. 

Major Mahi missing @mahi7781 !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

చదవండి: వ్యాపారులకు ధోని పాఠాలివే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top