FIFA World Cup 2022: లుకాకు లేకుండానే తొలి మ్యాచ్ బరిలో బెల్జియం

బెల్జియం వర్సెస్ కెనడా
ఈ రోజు అర్ధరాత్రి గం. 12:30 నుంచి
FIFA World Cup 2022: గత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన బెల్జియం జట్టు ఈసారి టైటిల్ వేటను నేడు కెనడాతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అయితే ఈ మ్యాచ్‌లో బెల్జియం స్టార్ ప్లేయర్ రొమెలు లుకాకు గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు.
ఎడమ తొడ కండరాల గాయంతో బాధపడుతున్న లుకాకు మొరాకోతో జరిగే రెండో మ్యాచ్‌లోనూ ఆడేది సందేహమేనని బెల్జియం కోచ్ రొబెర్టో మార్టినెజ్ తెలిపారు. 31 ఏళ్ల లుకాకు బెల్జియం తరఫున ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడి 68 గోల్స్ సాధించాడు.
చదవండి: ICC T20 Rankings: దిగజారిన కోహ్లి ర్యాంక్.. 4 హాఫ్ సెంచరీలు చేసినా కూడా..!