మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం | - | Sakshi
Sakshi News home page

మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

మూక ద

మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం

మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌ కుమార్‌

బొడ్డువారిపాలెంలో దాడి బాధితులకు పరామర్శ

మేదరమెట్ల: కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబంపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడికి పాల్పడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో విష సంస్కృతికి బీజం వేస్తున్నారంటూ మంత్రి గొట్టి పాటి రవికుమార్‌పై మండిపడ్డారు. గ్రామాల్లో దాడులను ప్రోత్సహించడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడలేని వ్యక్తి మంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. ఈ గొడవలన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయా..? లేక తెలిసే జరుగుతున్నాయా..? అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాడులు చేసి గాయపరిచింది కాక, తిరిగి పోలీసులను అడ్డం పెట్టుకుని బాధితులపైనే కేసులు పెడతామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖాకీ దుస్తుల వెనుక దాక్కుని రాజకీయ కక్షలు తీర్చుకోవడం మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని అని అశోక్‌కుమార్‌ బాధితులకు భరోసా ఇచ్చా రు. వీరి వెంట మండల పార్టీ కన్వీనర్‌ పాలపర్తి శ్రీధర్‌, కార్యకర్తలు, గ్రామ నాయకులు ఉన్నారు.

ఇటీవల అతనిపై పోక్సో కేసు నమోదు

కనిగిరిరూరల్‌: పోక్సో కేసులో అరైస్టె బెయిల్‌పై బయటకు వచ్చిన చాకిరాలకు చెందిన గూడూరి ఏషియా(33) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..మండలంలోని చాకిరాల ఎస్సీ కాలనీకి చెందిన జీ ఏషియా ను ఈనెల 9న పోక్సో కేసులో అరెస్ట్‌ చేశారు. అతనికి బెయిల్‌ రావడంతో బయటకు వచ్చిన తర్వాత చైన్నెలో బేల్దారీ పనికి వెళ్లాడు. తిరిగి ఈ నెల 15వ తేదీ ఆదివారం రాత్రి స్వగ్రామమైన చాకిరాల వచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడి పక్కన గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పెద్దగా శబ్ధం రావడంతో తల్లిదండ్రులు పరిశీలించగా ఏరియా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో పరువు పోయిందనే మానసిక బాధ, ఎప్పటికై నా జైలుకు వెళ్లాల్సి ఉంటుదనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మూక దాడులతో  టీడీపీ నేతల అరాచకం 
1
1/1

మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement