నిరుద్యోగులకు నమ్మక ద్రోహం..
ఈ సారి కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మాత్రంగానైనా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదని విద్యార్థి, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 2,18,767 మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి నెల నెలా రూ.3 వేల భృతి ఇవ్వాల్సి ఉంది. నెలకు రూ.65,63,01,000 చెల్లించాలి. కానీ రెండేళ్లుగా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదు. ఈ బడ్జెట్లోనైనా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయిస్తారేమోనని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.


