ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ... | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ...

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ...

ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ...

ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ...

గత ఎన్నికలకు ప్రచారంలో ఆడబిడ్డ నిధి పథకం పేరుతో 18 ఏళ్లు నిండి 58 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు అండ్‌ కో నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి అవసరమైన నిధులు కేటాయించనున్నట్లు లీకేజీలు ఇచ్చారు. తీరా చూస్తే అసలు ఆడబిడ్డ నిధి గురించి అస్సలు ప్రస్తావించకుండానే బడ్జెట్‌ ముగించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7,35,002 మంది మహిళలు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.1500 చొప్పున నెలకు రూ.110,25,03,000 ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ఈ సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టి మోసం చేశారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement