గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

గ్రావ

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు స్కూటీని ఢీకొట్టిన లారీ వాహనం ఢీకొని జింకకు గాయాలు

కొనకనమిట్ల: మండలంలోని ప్రభుత్వ, కొండపోరంబోకు, పశువుల బీడు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వడం, చెట్లు నరకడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ ఆవుల సురేష్‌ హెచ్చరించారు. కొనకనమిట్ల కొండపోరంబోకు భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలపై గురువారం ‘సాక్షి’లో ‘పోరంబోకుల గ్రావెల్‌ దందా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. శుక్రవారం అన్ని గ్రామాల వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలపై నిఘా ఉంచాలని, అనుమతి లేకుండా గ్రావెల్‌ తరలించడాన్ని అడ్డుకోవాలని చెప్పారు. తవ్వకాలకు ఉపయోగించే జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్‌ చేయడంతోపాటు జరిమానా విధిస్తామన్నారు.

పామూరు: రోడ్డు దాటుతున్న స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం పామూరు సమీపంలోని 565 జాతీయ రహదారిపై సీహెచ్‌సీ వైద్యశాల సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఎస్సై కట్టా కథనం మేరకు. మండలంలోని లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన బేల్దారి కూలీ ఉడుముల వేణుగోపాలరెడ్డి, తన భార్య లక్ష్మీదేవికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్కూటీపై పామూరులోని వైద్యశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సీహెచ్‌సీ సమీపంలో జంక్షన్‌ దాటుతుండగా కనిగిరి నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడగా, స్కూటీ లారీ కిందకు దూసూకుపోయింది. సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇరువురు క్షతగాత్రులకు వేర్వేరు అంబులెన్సుల్లో ఒంగోలుకు తరలించారు. మార్గమధ్యంలో క్షతగాత్రుడు వేణుగోపాల్‌రెడ్డి(42) మృతి చెందారు. లక్ష్మీదేవి ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు సంతానం ఉన్నారు. వేణుగోపాల్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జరుగుమల్లి(సింగరాయకొండ): గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక గాయపడ్డ సంఘటన శుక్రవారం సాయంత్రం జరుగుమల్లి మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాలేరు నుంచి వరి చేల మీదుగా ఓ జింక రోడ్డుపైకి వచ్చింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నడవలేని స్థితిలో రోడ్డు పక్కన పడిపోయింది. హెడ్‌ కానిస్టేబుల్‌ రమణయ్య పశు వైద్యాధికారుల కోసం ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్టు అధికారులు వచ్చి జింక తమ వెంట తీసుకెళ్లారు.

ప్రమాదంలో బేల్దారి కూలీ మృతి భార్యకు తీవ్ర గాయాలు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు 1
1/3

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు 2
2/3

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు 3
3/3

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement