సమస్యలపై గళమెత్తిన ఉపాధ్యాయులు
మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంగళరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ప్రభుత్వం 4 పెండింగ్ డీఏలు మంజూరు చేయడంతోపాటు మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకేఎస్ ప్రసాద్, ఆర్.దేశానాయక్ మాట్లాడుతూ.. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. తక్షణమే పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోజురోజుకూ జీవన వ్యయం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఖాశీం తదితరులు ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి డివిజన్ నాయకులు నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీలత, రాజా, గిద్దలూరు డివిజన్ నుంచి రాఘవరెడ్డి, చెంచయ్య, ఎస్ వెంకటేశ్వర్లు, బీవి నారాయణ, రహమత్‌బాష, కృపానందం, సోఫియా, జయశ్రీ, ఉషారాణి, మార్కాపురం డివిజన్ నుంచి జిల్లా గౌరవ అధ్యక్షుడు రాందాస్, అక్కల నారాయణ, వెంకట రమణ, జ్యోతి, శ్యామలాదేవి, లక్ష్మీనారాయణ, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం
వద్ద భారీ ధర్నా


