ఎస్‌హెచ్‌జీ రైతులకు రూ.87 కోట్ల రుణాలు
ఒంగోలు సబర్బన్: కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) గ్రూపు రైతులకు రూ.87 కోట్ల రుణాలు అందజేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప ప్రాంతీయ కార్యాలయ అధికారి ఈ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మడనూరులో నిర్వహించిన వ్యవసాయ రుణ అవగాహన, క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామానికి రూ.90 కోట్ల రుణాలు మంజూరు కాగా రూ.87 కోట్ల మేర నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. రుణ మంజూరు పత్రాలను సభ్యులైన రైతులకు అందజేశారు. సెంట్రల్ ఆఫీస్ డీజీఎం ఎం.పిచయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం డి.రమేష్, ఏఓ జి. కిశోర్ బాబు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డి.ఆశ, బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ మేనేజర్ బీకే ప్రసాద్, మడనూరు బ్రాంచ్ మేనేజర్ విద్యాసాగర్, ఒంగోలు, క్విస్ కాలేజ్ శాఖ మేనేజర్లు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప ప్రాంతీయ అధికారి వెంకటేశ్వరరావు


