టీడీపీలో గౌరవం, విలువలు లేవు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో గౌరవం, విలువలు లేవు

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

టీడీపీలో గౌరవం, విలువలు లేవు

టీడీపీలో గౌరవం, విలువలు లేవు

రాజీనామా చేసిన పొన్నలూరు మండల బూత్‌ కమిటీ కో కన్వీనర్‌

అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన

పొన్నలూరు: మండలంలోని పెద్ద వెంకన్నపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, మండల బూత్‌ కమిటీ కో కన్వీనర్‌ చల్లా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనతోపాటు కుటుంబ సభ్యులంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టింది మొదలు 40 ఏళ్లకు పైగా తమ కుటుంబ సభ్యులు టీడీపీ కోసం పనిచేశారని తెలిపారు. తన తాత, తండ్రి 40 ఏళ్లపాటు సర్పంచ్‌గా సేవలందించారని చెప్పారు. ప్రస్తుతం టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు, విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ పెద్దలు గ్రామంలో గ్రూపు రాజకీయం చేస్తూ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెటిస్తున్నారని ఆరోపించారు. గౌరవం, విలువలు లేని పార్టీలో ఉండలేనని, ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు పంపడంతోపాటు ఐ–టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మరి కొంత మంది నాయకులు టీడీపీకి రాజీనామా చేస్తారని ‘చల్లా’ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement