టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ

West Bengal  MP Arjun Singh Comments On TMC - Sakshi

సాక్షి, కోల్‌కతా: టీఎంసీ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 9.10 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న కూడా బెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాస్‌లో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఓ పేలుడు సంభవించింది. కొందరు వ్యక్తులు ఆయన ఇంటి గేటుపై బాంబులు విసిరారు.ఈ కేసు విచారణను ప్రస్తుతం ఎన్‌ఐఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది.

పేలుడు అనంతరం ఆయ మాట్లాడుతూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ దాడులు వెనుక ఉందని ఆరోపించారు. తనను, తన సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం గూండారాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను నార్త్‌ 24 పరగణాస్‌ అధ్యక్షుడు పార్థ భౌమిక్‌ ఖండించారు. ఆయా పేలుళ్లకు బీజేపీ ఎంపీనే ఏదో ఒక రకంగా కారణమైఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top