MP Vijayasai Reddy Strong Counter To Velagapudi Ramakrishna Babu - Sakshi
Sakshi News home page

‘ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి?’

Nov 11 2022 10:17 AM | Updated on Nov 11 2022 11:24 AM

Vijayasai Reddy Political Counter To TDP MLA Velagapudi Ramakrishna - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరికి కౌంటర్‌ ఇచ్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాగా, విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘ అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో  చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి!. 

వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజయవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. 

మద్యం సిండికేట్లు, కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, ఆక్రమణలు, కబ్జాలు చేయని అమాయకుడివా? జేబులో చిల్లర డబ్బుతో విశాఖకు వచ్చావు. ఇప్పుడు నీ ఆస్తులు వేల కోట్లు ఎలా అయ్యాయి?.’ అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement