Munugode Results: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్‌

Munugode Results: BJP Serious On Chief Election Officer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్గొండ: మునుగోడు వార్‌ కొనసాగుతోంది. కౌంటింగ్‌ మందకొడిగా సాగడంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ సీరియస్‌ అయ్యింది. ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఈసీ తీరు అనుమానాస్పదం..
ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌కు లీడ్‌ వస్తే తప్ప ఫలితాలు చెప్పరా? అంటూ మండిపడ్డారు. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

సీఈవో విఫలం
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. సీఈవో తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రచార సమయంలో చూపిన పక్షపాతమే ఫలితాల్లో చూపిస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top