రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమే: కన్నబాబు

Kurasala Kannababu Fires On TDP Chandrababu In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కన్నబాబు టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌లో రైతలును కాల్చి చంపింది ఎవరూ? అని కన్నబాబు ప్రశ్నించారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో రైతులపై బాబు లాఠీచార్జ్‌ చేయించారని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు. 

‘2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ అమలు చేసినప్పుడు లెఫ్ట్‌ పార్టీలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయి. విద్యుత్‌ బిల్లులు కట్టలేదని మెదక్‌, మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర చంద్రబాబుది. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడు.

పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు.  చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, టీడీపీలో చేరి మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమే’నని కన్నబాబు ధ్వజమెత్తారు.
చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top