హుస్నాబాద్‌: బీఆర్‌ఎస్‌కు అవే మైనస్సా?

Karimnagar: Who Win Next Incumbent in Husnabad Constituency - Sakshi

నియోజకవర్గం : హుస్నాబాద్‌

మండలాల సంఖ్య: 7 (హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి )

పెద్ద మండలం : అక్కన్నపేట

మొత్తం ఓటర్ల సంఖ్య : 2,27,000

పురుషులు : 1,13,000; మహిళలు: 1,14,000

2014 నుండి హుస్నాబాద్ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుండి వోడితల సతీష్ కుమార్ గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి, రావు, కాపు, ముదిరాజ్, గిరిజన సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. 

కులాల వారిగా ఓటర్ల శాతం

బిసి:  60%
ఎస్సీ: 15%
ఎస్టీ:   10%
ఇతరులు: 15%

పార్టీల పరిస్థితి 

 • బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు
 • కాంగ్రెస్‌లో కూడా ఆశావాహులు లేరు
 • బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు
 • సీపీఐ కూడా పోటీకి ఆసక్తి చూపుతుంది

ఆశావహులు 

 • బీఆర్ఎస్ నుంచి వోడితల సతీష్ కుమార్
 • కాంగ్రెస్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి 
 • బీజేపీ నుండి ఇద్దరు (బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు)
 • సీపీఐ నుండి చాడ వెంకటరెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు

వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు..

 • గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించలేకపోవటం
 • IOC భవనంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా హుస్నాబాద్‌లో మినీ స్టేడియం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయలేకపోవడం
 • గ్రామాల పరిధిలో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవటం.. 

అధికార పార్టీ అభ్యర్థి, అనుకూలతలు

 •  గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చటం 
 • వోడితల సతీష్ కుమార్.. సౌమ్యుడు, మృదుస్వభావ వ్యక్తిత్వం కలిగిన వారవటం.

ప్రతికూలతలు..

 • అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో సమయపాలన పాటించడనే విమర్శ

ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు 

 • గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రారంభించకపోవటం
 • పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్లను అర్హులకు అందిచక పోవటం..

ప్రతికూలతలు..

 • అధికారిక పార్టీని గ్రామ స్థాయిలో ఎదురుకొలేకపోవటం.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top