కోవిడ్‌ ప్రమాదంలో 40 కోట్ల మంది

Two Thirds Of Indians Have Covid Antibodies, 40 Crore Still At Risk - Sakshi

దేశంలో మూడింట రెండొంతుల మందిలో యాంటీబాడీలు

సెరో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్‌ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్‌ బారిన పడే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్‌–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు. దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్‌ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు.

సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది. పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్‌పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్‌ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు.

125 రోజుల్లో కనిష్ట స్థాయికి కేసులు
దేశంలో 125 రోజుల తర్వాత ఒక్క రోజులో కనిష్టంగా 30,093 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,11,74,322కు చేరాయి. అదేవిధంగా, 111 రోజుల తర్వాత ఒక్క రోజులో అతితక్కువగా 374 కోవిడ్‌ మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కోవిడ్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,14,482కు చేరుకుంది. యాక్టివ్‌ కేసులు కూడా 117 రోజుల తర్వాత 4,06,130కి తగ్గాయని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్‌ కేసులు 1.30% మాత్రమే. రికవరీ రేట్‌ కూడా 97.37%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,53,710 మంది కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు.  

చిన్నతరగతులతో స్కూళ్లు ఆరంభించడం బెటర్‌! 
ఒకవేళ భారత్‌లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ సూచించారు. మానవ కణాల్లో వైరస్‌ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్‌ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు. దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్‌(బ్లడ్‌ సీరమ్‌లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్‌ వేవ్‌ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-07-2021
Jul 21, 2021, 10:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 42,015 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
21-07-2021
Jul 21, 2021, 02:40 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మూడో వేవ్‌ కరోనా...
21-07-2021
Jul 21, 2021, 00:31 IST
అప్రమత్తతతో వివేకంగా వ్యవహరించాల్సిన సమయంలో విస్మయపరిచేలా ప్రవర్తిస్తే ఏమనాలి? అవును. కొన్నిసార్లు... కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తే అవాక్కవుతాం. పవిత్రమైన...
20-07-2021
Jul 20, 2021, 19:01 IST
కరోనా నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో 203 లక్షణాలు ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్‌...
20-07-2021
Jul 20, 2021, 13:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) వేనని ఇండియన్‌...
20-07-2021
Jul 20, 2021, 11:36 IST
వైద్యురాలిలో ఒకేసారి కరోనా రెండు వేరియంట్లను గుర్తించాము
20-07-2021
Jul 20, 2021, 01:31 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం...
19-07-2021
Jul 19, 2021, 19:03 IST
తైపీ: కోవిడ్‌-19పై పోరులో తైవాన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కరోనా నిరోధక వాక్సిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో స్థానికంగా...
19-07-2021
Jul 19, 2021, 08:18 IST
చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.  ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక...
19-07-2021
Jul 19, 2021, 02:02 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గిందనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఆవరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా గుంపులు గుంపులుగా...
19-07-2021
Jul 19, 2021, 01:07 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందని, అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు...
18-07-2021
Jul 18, 2021, 04:22 IST
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.....
18-07-2021
Jul 18, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది బాధితులు చెప్పే మాట. ఇంతకాలం...
18-07-2021
Jul 18, 2021, 00:00 IST
కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధిని కోవిడ్‌–19 అంటారన్నది తెలిసిందే. ఈ ఇంగ్లిష్‌ పదంలో తొలి రెండు అక్షరాలు ‘సీఓ’ అన్నవి...
17-07-2021
Jul 17, 2021, 08:45 IST
కర్ణాటక వార్తలు
17-07-2021
Jul 17, 2021, 07:58 IST
లాక్‌డౌన్‌ పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం
17-07-2021
Jul 17, 2021, 02:44 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది....
17-07-2021
Jul 17, 2021, 02:17 IST
వాషింగ్టన్‌: అమెరికాతోపాటు భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులు సుమారు 10 మంది కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఈ...
16-07-2021
Jul 16, 2021, 19:56 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది...
16-07-2021
Jul 16, 2021, 17:49 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 3,001 మంది కరోనా బాధితులు కోలుకుని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top