దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు

South Africa inks MoU to send 12 cheetahs to Kuno National Park - Sakshi

జోహన్నెస్‌బర్‌/న్యూఢిల్లీ: భారత్‌కు మరో డజను చీతాలు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చే చీతాలను మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో ఉంచుతారు. దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ పెంచేందుకు కొద్ది నెలల క్రితం నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పడు వాటికి తోడుగా ఫిబ్రవరిలో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తాయని అటవీ, మత్స్య సంపద సంరక్షణ, పర్యావరణ (డీఎఫ్‌ఎఫ్‌ఈ) శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 12 చీతాలు వస్తే, ఆ తర్వాత ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఏడాదికి 12 చీతాలు చొప్పున వస్తాయి. ప్రపంచంలోనున్న 7 వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా దేశాల్లో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top