Cyber Attacks: భారత్‌పై సైబర్‌ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్‌

Prophet Row 70 Indian Websites Hacked By Cyber Attacks - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్‌కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వెబ్‌సైట్లను సైబర్‌ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో డ్రాగన్‌ పోర్స్‌ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో సైబర్‌ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.

ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్‌సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్‌ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్‌ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పోర్టల్స్‌ వంటి ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

చదవండి: ప్రవక్తపై కామెంట్లు: మా బాస్‌ను మధ్యలోకి లాగి బద్నాం చేయకండి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top