నీళ్లులేని ట్యాంక్‌లో పడిన చిరుత

బనశంకరి: వేట కోసం వచ్చిన చిరుత నీళ్లులేని ట్యాంక్‌లో పడిపోయిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుందాపుర కొడ్లాడిలోకి శుక్రవారం ఉదయం చొరబడిన చిరుత చంద్రశెట్టి అనే వ్యక్తి ఇంటి సమీపంలో కుక్కను వెంబడిస్తూ నీళ్లు లేని ట్యాంక్‌లో పడిపోయింది. అటవీశాఖాధికారి ప్రభాకర్ బృందం చేరుకొని చిరుతను పైకి లాగి బోనులో వేసి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. చిరుతకు 5ఏళ్ల వయస్సు ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు.