ప్రశాంత్ భూషణ్‌పై విచారణ నిలిపి వేయండి

Intellectuals Ask Stay On Prashant Bhushan Contempt of Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుపైనే కాక ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టుకు మేధావుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 131 మంది మేధావులు లేఖ రాశారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  మదన్ బీ లోకుర్ కూడా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు సరి కావని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రతిష్ట, న్యాయవ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఆయనపై చర్యలను నిలిపివేయాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. (బాకీలపై మరో మాట లేదు..)

వారం రోజుల క్రితం ప్రశాంత్‌ భూషణ్‌ దేశంలో గత ఆరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో సుప్రీం కోర్టుకు చెందిన  నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించారని ట్వీట్‌ చేశారు. అంతేకాక ఇక ప్రస్తుత సీజేఐ ఎస్‌ ఏ బాబ్డే ఆ మధ్య హార్లే డేవిడ్ సన్ బైక్‌ని నడిపారని.. ఆ సమయంలో  హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారంటూ మరో ట్వీట్‌ చేశారు. కోర్టు లాక్‌డౌన్‌లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఇలా చేయవచ్చా అని ప్రశ్నించారు. దాంతో ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (బ్యాట్‌ పట్టిన సీజే బాబ్డే.. టాప్‌ స్కోరర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top