ఒళ్లు గగుర్పొడిచే వీడియో..అది డ్యాన్స్‌ కాదు!

Hair Raising Video Two Snakes Fight For Dominance - Sakshi

రెండు పాముల సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.‘‘ఆధిపత్యం కోసం ర్యాట్‌ స్నేక్‌ల మధ్య యుద్ధం. రెండు మగ పాములు.. తమ ఉనికిని చాటుకునేందుకు, తమ తోడును రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం’’ అంటూ అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. (వైరల్‌: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు! )

ఈ క్రమంలో కొంతమంది.. ఇది పాముల సయ్యాట(ఆడ, మగ)కు సంబంధించిన వీడియో అని, ఇలాంటివి చాలానే చూశామని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు స్పందించిన సదరు అధికారి.. ఇవి మగ పాములు అని, అవి డ్యాన్స్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా ర్యాట్‌ స్నేక్‌లు విష రహితమైనవి. సాధారణంగా అవి రోడెంట్స్‌(ఎలుకలు)ను వేటాడి ఆహారం సంపాదించుకుంటాయి. (వరద నీటిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే.. )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top