కొత్త కేసులు 78 వేలు

78524 fresh COVID-19 cases in India - Sakshi

న్యూఢిల్లీ: ఒక్క రోజులోనే 78,524 కేసులు బయటపడటంతో దేశంలో నిర్ధారణ అయిన మొత్తం కోవిడ్‌ కేసులు 68 లక్షలు దాటాయి. గురువారం నాటికి 58,27,704 మంది కోవిడ్‌ బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 85.25%గా ఉందని కేంద్రం తెలిపింది. మొత్తం కేసులు 68,35,655 కాగా, 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 971 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,05,526కు చేరుకుంది. మృతుల రేటు 1.54%నికి పడిపోయింది. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 9,02,425కు చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షల మార్కు, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్‌ 5కి 40 లక్షలు, సెప్టెంబర్‌ 16న 50 లక్షలు, సెప్టెంబర్‌ 29వ తేదీ నాటికి 60 లక్షల మార్కు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు 8,34,65,975 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top