పుట్టినరోజు ప్రత్యేకం | Thandel team releases Naga Chaitanya birthday poster | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు ప్రత్యేకం

Nov 24 2024 12:21 AM | Updated on Nov 24 2024 12:21 AM

Thandel team releases Naga Chaitanya birthday poster

హీరో నాగచైతన్య పుట్టినరోజు (నవంబరు 23) సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘తండేల్‌’ అప్‌డేట్‌తో పాటు మరో కొత్త చిత్రం ప్రకటన వెలువడింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా  ‘తండేల్‌’ నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో తండేల్‌ రాజు పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయిన విధానం భారతీయ చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోతుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. 

డిసెంబరులో ప్రారంభం: ‘విరూపాక్ష’ (2023) దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామ్యంలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రం నిర్మించనున్నారు. నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా కావడంతో ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. ‘‘మిథికల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రం ‘ఎన్‌సీ 24’. డిసెంబరులో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శామ్‌ దత్, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement