'ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయా'.. నాగచైతన్య హీరోయిన్‌పై సామ్‌ కామెంట్స్! | Samantha Praises Sai Pallavi's Dance In Naga Chaitanya Movie - Sakshi
Sakshi News home page

Samantha: 'తాను మంచి డ్యాన్సర్‌'.. నాగచైతన్య హీరోయిన్‌పై సమంత ప్రశంసలు!

Published Thu, Feb 22 2024 7:23 AM

Samantha Shares Express About Naga Chaitanya Heroine Dance  - Sakshi

హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్‌ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడుదాని నుంచి బయటపడటానికి శత విధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు.

గతంలోనే అంగీకరించిన సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్‌సిరీస్‌ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ద్వారా విడుదల చేశారు.

సాయిపల్లవిపై ప్రశంసలు

మరో టాలీవుడ్ హీరోయిన్‌ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయిపల్లవి మంచి డాన్సర్‌ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్‌ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లానన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్‌ను చూసి దృష్టి మరల్చలేక కళ్లప్పగించి చూస్తుండి అలాగే పోయానన్నారు. 

కాగా..ప్రస్తుతం నాగచైతన్య,  సాయిపల్లవి జంటగా తండేల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్‌’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement