Rakul Preet Singh Says No To Director Gopichand Malineni Next Movie? - Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాకు నో చెప్పిన రకుల్‌.. కారణం ఇదేనట!

May 30 2021 4:36 PM | Updated on May 30 2021 7:03 PM

Rakul Preet Singh Says No To Director Gopichand Next Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘అఖండ’తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతుంది.  ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కు ప్రాధాన్యం ఉందట. అందులో ఓ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారట. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బాలయ్యకు నో చెప్పిందట. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో  డేట్స్ అడ్జెస్ట్ చేయలేక బాలయ్య సినిమాకి నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో 'ఎటాక్', 'మే డే' లో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక అంతకు ముందు బాలయ్య  సినిమాలో హీరోయిన్‌ కోసం దర్శకుడు గోపీచంద్‌ శ్రుతిహాసన్‌ని సంప్రదించాడట. ‘సలార్' సినిమా కారణంగా డేట్లు కుదరడం లేదని ఆమె కూడా నో చెప్పినట్లు వార్తలు వినిపించాయి. 

ఇక అఖండ విషయానికి వస్తే.. నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో  సింహ, లెజెండ్ లాంటి సూపర్‌ చిత్రాలు వచ్చాయి. దీంతో మూడో చిత్రం అఖండపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అలాగే ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement