'సలార్' విలన్ కొత్త సినిమా.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ | Prabhas Unveils First Look of Prithviraj 'The Goat Life' Movie - Sakshi
Sakshi News home page

The Goat Life Movie: అలాంటి లుక్‌లో 'సలార్' నటుడు.. ఏకంగా అలాంటి కథతో

Published Wed, Jan 10 2024 6:12 PM

Prithviraj The Goat Life Movie First Look And Prabhas Instagram Post - Sakshi

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలుసు. అతడి సినిమాల్ని ఇప్పటికే ఓటీటీల్లో చూసి ఎంటర్‌టైన్ అయ్యారు. ఈ మధ్య 'సలార్' సినిమాలోనూ ప్రభాస్ ప్రాణ స్నేహితుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండో భాగంలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీకొట్టే విలన్‌గా కనిపించబోతున్నాడు. సరే దాని గురించి కాసేపు పక్కనబెడితే పృథ్వీరాజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. దీనిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు.

'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) పేరుతో తీస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళని వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథని వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమాలో చూపించబోతున్నారు. పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసిన ప్రభాస్.. లుక్ చూసి చాలా థ్రిల్ అవుతున్నానని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఐదు భాషల్లో ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తీశారు.

ఇక హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. 'నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనేది తెలుసు. ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్‌లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. ఈ మూవీకి పనిచేస్తున్నప్పుడు మేం ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు అంతే హ్యాపీగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement