Adipurush Movie: Fans Fires On Actor Sunny Singh For His Tweet On Prabhas - Sakshi
Sakshi News home page

Adipurush Movie: పప్పులో కాలేసిన సన్నీ సింగ్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Nov 8 2021 5:29 PM | Updated on Nov 9 2021 9:17 AM

Prabhas Fans Fires On Adipurush Actor Sunny Singh Over His Tweet - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌, స్పిరిట్‌తో పాటు నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తికాగా.. సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చివరి షెడ్యుల్‌ను జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రభాస్‌ ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా చేస్తున్న బాలీవుడ్‌ నటుడు సన్నీ సింగ్‌ షూటింగ్‌లో ప్రభాస్‌తో ఏర్పడిన బాండింగ్‌ గురించి చెబుతూ పప్పులో కాలేశాడు.

చదవండి: పునీత్‌ గొప్ప మనసు, సేవా కార్యక్రమాల కోసం రూ. 8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

ట్విటర్‌లో ప్రభాస్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పెద్దన్నతో పని చేయడం గొప్పగా ఉంది. మా ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికి కొనసాగుతుంది’ అని ట్వీట్‌లో రాసుకొస్తు ప్రభాస్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేశాడు. ఇది చూసిన కొందరు అభిమానులు సంతోషిస్తుంటే.. మరికొందరు సన్నీ సింగ్‌పై కౌంటర్‌ వేస్తున్నారు. అంతేగాక ‘ఇదేంటి బ్రో కాస్తా చూసుకోవాలి కదా, తెలుసుకొని పోస్ట్‌ చేయండంటు’ అతడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సన్నీ సింగ్‌పై నెటిజన్లు మండిపడటానికి అసలు కారణం ఏంటంటే.. ప్రభాస్‌కు ఇప్పటి వరకు అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ లేదు.

చదవండి: కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌

కేవలం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రభాస్‌ పేరుతో ఎన్నో ఫేక్‌ ట్విటర్‌ ఖాతాలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని అతడు ట్యాగ్‌ చేశాడు. అది గమనించిన ఫ్యాన్స్‌ ‘లక్ష్మణుడి’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న సన్నీ సింగ్‌ ఆ ట్వీట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అదే పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్‌ చేశాడు. కాగా ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడి పాత్ర పోషిస్తుండగా కృతి సనన్‌ సీతగా నటిస్తోంది. ఇక సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా కనిపించబోతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement