నాగచైతన్య @15 | Naga chaitanya thandel movie shooting in hyderabad | Sakshi
Sakshi News home page

నాగచైతన్య @15

Sep 6 2024 12:54 AM | Updated on Sep 6 2024 12:54 AM

Naga chaitanya thandel movie shooting in hyderabad

తెలుగు చిత్ర పరిశ్రమలో పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు హీరో నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్‌’ (2009) సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నాగచైతన్య. పదిహేనేళ్ల కెరీర్‌లో విలక్షణమైనపాత్రలతో పలు సూపర్‌ హిట్‌లను ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారాయన. పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’ నుంచి కొత్తపోస్టర్‌ను విడుదల చేశారు.

‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ‘‘నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘తండేల్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement