కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్‌ క్లియర్‌ | Kangana Ranaut's 'Emergency' Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్‌ క్లియర్‌

Published Mon, Nov 18 2024 2:24 PM | Last Updated on Mon, Nov 18 2024 2:46 PM

Kangana Ranaut's 'Emergency' Movie Release Date Locked

కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంగనా ‌ లీడ్‌ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోసం ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్‌ చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో రిలీజ్‌ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది.

ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో  తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్‌  పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.

1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్‌ 14, 2024 సెప్టెంబర్‌ 6) వాయిదా పడింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన  కంగనా రనౌత్‌ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement