కేంద్ర మంత్రితో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగ‌నా ర‌నౌత్ | Kangana Ranaut Comment On Central Minister Chirag Paswan | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రితో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగ‌నా ర‌నౌత్

Apr 17 2026 1:23 PM | Updated on Apr 17 2026 2:13 PM

Kangana Ranaut Comment On Central Minister Chirag Paswan

బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌లు ప్రేమలో ఉ‍న్నారంటూ కొద్దిరోజులుగా రూమర్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కంగనా రియాక్ట్‌ అయ్యారు. పలు వేదికలపై వీరిద్దరూ కలిసి తరచుగా కనిపిస్తున్నడంతో ఈ రూమర్స్‌ వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన అలాంటి రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. చిరాగ్‌ పాశ్వాన్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పారు.

చిరాగ్ పాశ్వాన్‌తో తనకు ఉన్న బాండింగ్‌ గురించి కంగనా రనౌత్‌ ఇలా చెప్పారు. 'చిరాగ్ నాకు పదేళ్లుగా తెలుసు. జనాలు అనుకుంటున్నట్లు మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే  ఎప్పుడో పెళ్లి అయి ఉండేది. ఆపై పిల్లలు కూడా ఉండేవారు. మా  మధ్య ఎలాంటి ప్రేమ, రొమాన్స్ లేవు. ఒక‌వేళ  రొమాన్స్ కావాల‌నుకుంటే  అది ఎప్పుడో జ‌రిగి ఉండేది. అదంతా సోషల్‌మీడియాలో కొందరు క్రియేట్‌ చేసిన అపోహ మాత్రమే. గతంలో ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అలా మంచి స్నేహం మాత్రమే ఉంది. ఎప్పటికీ అది కొనసాగుతుంది' అని కంగనా రనౌత్‌ క్లారిటీ ఇచ్చారు.

కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో జంటగా నటించారనే విషయం తెలిసిందే. 2011లో విడులైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆ సినిమా తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్లారు. కంగన మాత్రం కొంత కాలం పాటు సినిమాల్లోనే ఉంటూ వచ్చారు. గత ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంగనా రనౌత్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement