కామెడీ.. థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

కామెడీ.. థ్రిల్‌

Published Thu, Dec 3 2020 6:20 AM

Happy Days Hero Signs New Film  - Sakshi

‘హ్యాపీడేస్‌’ ఫేమ్‌ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్‌ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్‌ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి  కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సాయి కార్తీక్‌ క్లాప్‌ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్‌ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు.

‘‘ఇంతకాలం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్‌. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్‌ ఇది’’ అన్నారు విరాట్‌ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్‌ అయ్యాను’’ అన్నారు రాహుల్‌. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్‌. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement