
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఫ్లాట్స్, కార్లు అని ఏదో ఒకటి కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) భర్త ఖరీదైన కారు కొని భార్యకి బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ దీని రేటు ఎంతో తెలుసా?
(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ)
కేరళకు చెందిన అమలాపాల్ ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్నాళ్ల ముందు వరకు మాత్రం తెలుగు, తమిళ, మలయాల చిత్రాల్లో నటించింది. 2023లో జగత్ దేశాయ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత టైమ్ అంతా పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తోంది. గతేడాది కొడుకు కూడా పుట్టాడు.
తాజాగా సందర్భం ఏంటో తెలియదు గానీ జగత్.. అమలాపాల్ కి ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW Car) కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర మార్కెట్ లో రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా వీళ్ల దగ్గర కాస్ట్ లీ పోర్స్ కారు కూడా ఒకటి ఉంది. బీఎండబ్ల్యూ కారు వీడియోని మాత్రం అమలాపాల్, ఆమె భర్త ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))