బంపరాఫర్‌ కొట్టేసిన అఖిల్‌.. ఆ హీరో మూవీలో చాన్స్‌

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Play Key Role In Gopichand Seeti Maar Movie - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. గత మూడు సీజ‌న్ల‌తో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి కాస్త  ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా యూట్యూబ‌ర్లు, చిన్న న‌టీన‌టులు పాల్గొనప్ప‌టికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా గెలిచిన అభిజీత్‌కి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మూడో స్థానంలో నిలిచిన సోహైల్‌కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్‌ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో న‌టిస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి, బ్ర‌హ్మానందం ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్‌బాస్‌ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్‌కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా నాల్గో సీజ‌న్‌లో పాల్గొన్న‌ ఒక్కొక్కరికి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో క్రేజీ జంట‌గా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వ‌స్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సీజ‌న్‌లో పాల్గొని ర‌న్న‌ర్‌గా నిలిచిన అఖిల్ సార్ధ‌క్ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. స్టార్‌ హీరో గోపిచంద్ మూవీలో అఖిల్‌కి అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోందిసంపత్‌ నంది దర్శకత్వంలో గోపిచంద్‌, తమన్నా హీరో హీరోయిన్లుగా ‘సిటీమార్‌’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో సెకండాఫ్‌లో ఓ కీల‌క పాత్ర కోసం అఖిల్‌ని తీసుకున్నార‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు తెలుస్తోంది.

నిజానికి అఖిల్‌ 2016లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘బావ మరదలు’ అనే సినిమా ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ద్వారా అఖిల్‌కి ఎలాంటి గుర్తింపు రాలేదు. దీంతో అఖిల్‌ బుల్లితెర వైపు అడుగులు వేశాడు. పలు సీరియళ్లలో కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లోకి వెళ్లి రన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు అఖిల్‌కి పలు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top