ఇంకా నీకు బుద్ధి రాలేదు, నువ్వో బ‌చ్చాగానివి: అభిజిత్‌

Bigg Boss 4 Telugu: Abhijeet Fight With Akhil Like Tiger Vs Goat - Sakshi

ఓర‌కంగా బిగ్‌బాస్ హౌస్ మాంత్రికుడి మాయాజాలం వంటిదే. కంటెస్టెంట్లు ఎప్పుడు క‌లిసిపోతారో, ఎప్పుడు విడిపోతారో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. సీజ‌న్ మొద‌టి నుంచే మోనాల్ కోసం కొట్టుకు చస్తూ బ‌ద్ధ శ‌త్రువుల్లా మారిన‌ అఖిల్‌, అభిజిత్ త‌ర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మోనాల్‌ను పక్క‌న పెట్టేశారు. త‌ర్వాత ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నేటి నామినేష‌న్‌లో అది తారాస్థాయికి చేరుకోనున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా అఖిల్ మాట్లాడుతూ త‌ను సీక్రెట్ రూమ్‌లో విన్న డైలాగుల‌ను ఏక‌రువు పెట్టాడు.

ఇంత జ‌రిగినా బుద్ధి రాలేదు..
"మ‌ట‌న్ షాపు ఓనర్ మేక‌కు గ‌డ్డి చూపించాడు. మేక లోప‌లికి వెళ్లిపోయింది.." అని అభి త‌న గురించి అన్న మాట‌నే తిరిగి వ‌ల్లించాడు. కానీ లోప‌లికి వెళ్లిన మేక పులిలా వ‌చ్చింద‌ని చెప్ప‌గా మేక ఎప్పుడూ పులి కాద‌ని, బ‌ల‌వుతుంద‌ని అభిజిత్ కౌంట‌రిచ్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా మ‌ళ్లీ లోప‌లికి వ‌స్తాన‌న్న న‌మ్మ‌కంతోనే వెళ్లిపోయావు అని అస‌లు పాయింట్ లాగాడు. "ఇంత జ‌రిగినా బుద్ధి రాలేదు. అయినా నా గురించి చెప్ప‌డానికి నువ్వెవ‌రు? ఆఫ్ట్రాల్.." అంటూ గ‌ర‌మ‌య్యాడు. నీకు నువ్వు తురుమ్‌ఖాన్ అనుకుంటున్నావా? నువ్వో బ‌చ్చాగానివి, ఏం తెల్వ‌దు పో.. అన‌డంతో అఖిల్ ఫేస్ మాడిపోయింది. (చ‌ద‌వండి: నువ్వు ఫేక్‌, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్‌‌)

అఖిల్ మీద నెటిజ‌న్ల జోకులు
దీంతో మంట మీదున్న అఖిల్ 'నువ్వు బిగ్‌బాస్‌కు రావ‌డానికి 32 ఏళ్లు ప‌ట్టిందేమో, నాకు 25 ఏళ్లే ప‌ట్టింది' అని అఖిల్ రివ‌ర్స్ కౌంట‌రిచ్చాడు. అగ్నిగుండంలా ర‌గిలిపోతున్న ఈ ఇద్ద‌రి గొడ‌వ నామినేష‌న్ త‌ర్వాత చ‌ల్లారిపోతుందేమో కానీ వాళ్ల అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో కొట్టుకు చ‌స్తున్నారు. సీక్రెట్ రూమ్‌లో పిల్లిలా ఏడ్చిన అఖిల్ పులి ఏంట‌ని విమ‌ర్శిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌కు బ‌య‌ట ఉండే మేక‌లు మేమేమే అని అరిస్తే లోప‌ల ఉన్న మేక‌ మ‌మ్మీ అంటుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు మాత్రం అత‌డు సింహం అని, అత‌డి మీద కుళ్లు జోకులు వేస్తే ఎందుకు స‌హిస్తాడ‌ని వెన‌కేసుకొస్తున్నారు. మిగ‌తా నెటిజ‌న్లు.. అన‌వ‌స‌రంగా అఖిల్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతూ త‌న ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకుంటున్నాడ‌ని అంటున్నారు. మొత్తానికి సీక్రెట్ రూమ్ వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌లైంద‌ని చెప్తున్నారు. (చ‌ద‌వండి: గే బార్‌కు వెళ్లాను: అభిజిత్ షాకింగ్ సీక్రెట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top