అర్జున్ కపూర్‌కు, మలైకా అరోరాకు కరోనా

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కు, నటి మలైకా అరోరాకు కరోనా సోకింది. తనకు కరోనా వచ్చిందనే విషయాన్ని అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కరోనా సోకిందనే విషయం అందరికీ తెలియజేయడం నా బాధ్యత. నేను బాగానే ఉన్నాను. నాకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. వైద్యుల సూచన మేరకు మా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను.
నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. మనందరం ఈ వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతాం అని నమ్ముతున్నాను’’ అన్నారు అర్జున్ కపూర్. అలాగే మలైకా అరోరాకు కరోనా వచ్చినట్లు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేశారు. అర్జున్, మలైకా కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో కూడా ఉన్నారని బాలీవుడ్ టాక్.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి