లెజెండరి సింగర్‌ వాణీ జయరాంకు అమూల్‌ ఘన నివాళి | Sakshi
Sakshi News home page

Vani Jairam: లెజెండరి సింగర్‌ వాణీ జయరాంకు అమూల్‌ ఘన నివాళి

Published Mon, Feb 6 2023 6:01 PM

Amul India Tribute Singer Vani Jairam Demise With Sepia Toned - Sakshi

లెజెండరి సింగర్‌ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

చదవండి: వచ్చే వారమే ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? ట్వీట్‌ వైరల్‌

అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్‌ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్‌. దీనిని తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్‌ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్‌ ట్వీట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్‌ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్‌, వందల్లో లైక్స్‌ వచ్చాయి. 

చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత

Advertisement
 
Advertisement
 
Advertisement