విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి బ్రేకులు.. అడ్డుపడుతుంది ఆమేనా..? | Sakshi
Sakshi News home page

విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి బ్రేకులు.. అడ్డుపడుతుంది ఆమేనా..?

Published Tue, Jan 23 2024 1:43 PM

Actor Vijay Political Entry Delay Behind Reason - Sakshi

హీరో విజయ్ సౌత్‌ ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. రీజనల్‌ సినిమాతోనే కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తాడు. పాన్‌ ఇండియా రేంజ్‌ హీరోలకు ధీటుగా తన సినిమా కలెక్షన్స్‌ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన లియో సినిమా కూడా సుమారుగా రూ. 630 కోట్లు రాబట్టింది. ఒక రీజనల్‌ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టడం అంటే సులభం కాదు. కోలీవుడ్‌లో ఆయనకు భారీగా  ఫ్యాన్స్‌ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న తన అభిమానులకు ఎలాంటి సాయం చేసేందుకు అయినా విజయ్‌ ముందుంటాడు. రీసెంట్‌గా తమిళనాడులో తుపాన్‌ వల్ల రోడ్డున పడిన పలు కుటుంబాలను ఆయన ఆదుకున్న విషయం తెలిసిందే.  

ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్‌ల్లో తమళనాట తనొక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలబరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తు ఉన్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని టాక్‌ ఉంది. కానీ విజయ్‌ రాజకీయ ఎంట్రీని ఆయన సతీమణి సంగీత అడ్డుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే రాజకీయ పార్టీని ప్రకటించడంలో విజయ్‌ ఆలస్యం చేస్తున్నాడని టాక్‌ ఉంది.

(ఇదీ చదవండి: మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్‌ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్‌)

రాజకీయాల్లోకి విజయ్‌ రావాలని కోరుకుంటున్నా.. దానిని ఆయన సతీమణి సంగీతతో పాటు వారి కుమారుడు జాసన్ సంఝా కూడా వ్యతిరేకిస్తున్నారట. విజయ్‌ రాజకీయ నిర్ణయాన్ని ఆయన భార్య, కుమారుడు వ్యతిరేకించడం వల్లే వారి మధ్య మనస్పర్థలకు ప్రధాన కారణమని తమిళ మీడియా పేర్కొంటుంది. రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడుతుందట. కానీ విజయ్‌ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టి ఉన్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. 

సంగీత ఒక డాక్టర్.. విజయ్‌తో వివాహం అయిన తర్వాత గృహిణిగా కొనసాగుతుంది. తన కుమార్తెతో కలిసి ఆమె లండన్‌లో ఉంటున్నారు. సుమారు గత రెండేళ్లుగా విజయ్‌, సంగీత కలిసి ఏ ఈవెంట్‌లో కనిపించలేదు. గతంలో విజయ్‌ కూడా తన సినిమా పూర్తి అయిన తర్వాత లండన్‌ వెళ్లేవారు.. ఈ మధ్య కాలంలో ఆయన కూడా అక్కడకు వెళ్లలేదు. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ కారణం వల్లే వారిద్దరి మధ్య పలు సమస్యలు వచ్చాయని.. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయని తెలుస్తోంది.

విజయ్‌- సంగీత మధ్య ఎలాంటి గొడవలు లేవని విజయ్‌ సన్నిహితులు పలుమార్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం లియో నటి జనని కూడా విజయ్‌ విడాకుల గురించి రియాక్ట్‌ అయింది. విడాకుల వార్త ఉట్టి పుకారే అని ఆమె తెలిపింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement