కన్నీరు పెట్టుకున్న ఆమిర్‌ ఖాన్‌.. ఓదార్చిన సాయి పల్లవి: వీడియో | Aamir Khan Gets Emotional At Son Junaid Debut Ek Din Movie Event In Mumbai, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

కన్నీరు పెట్టుకున్న ఆమిర్‌ ఖాన్‌.. ఓదార్చిన సాయి పల్లవి: వీడియో

Apr 27 2026 9:23 AM | Updated on Apr 27 2026 10:02 AM

Aamir Khan Breaks Down At Ek Din Event In Mumbai

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ తన కుమారుడు జునైద్‌ ఖాన్‌ని హీరోగా వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సునీల్‌ పాండే తెరకెక్కించిన చిత్రం ఏక్‌ దిన్‌. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.ఆమిర్‌ ఖాన్‌, మన్సూర్‌ ఖాన్‌, అపర్ణ పురోహిత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్‌ మ్యూజికల్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి ఆమిర్‌ కూడా హాజరయ్యాడు. కొడుకు జునైద్‌, కోస్టార్‌ సాయి పల్లవి మధ్యలో కూర్చొని సినిమా వీక్షించాడు. కొడుకుని తొలిసారి బిగ్‌స్క్రీన్‌పై చూసి ఆమిర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. 

కళ్లజోడు తీసి కన్నీళ్లను తుడుచుకొని సంతోషంగా సినిమాను వీక్షించాడు. ఆమిర్‌ ఎమోషనల్‌ అవుతుంటే..పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement