తొమ్మిదోసారి వ్యాక్సిన్.. అసలు విషయం తెలిస్తే షాక్‌!

Man Taken eight doses of Covid Vaccines At Belgium - Sakshi

కరోనా వైరస్‌ తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే రక్ష అని తెలిసినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు. చాలా మంది అయితే ఇప్పటకీ మొదటి డోస్‌ వ్యాక్సిన్ కూడా వేయించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఓ వ్యక్తి మాత్రం తొమ్మిదో సారి వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చి.. అక్కడ ఉన్నవారందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది.

బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్‌ చార్లెరోయ్ నగరంలో ఓ యువకుడు వ్యాక్సిన్ తీసుకోకుండా సర్టిఫికెట్ పొందాలనుకునే వారిని సంప్రదించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారి స్థానంలో అతను వ్యాక్సిన్ వేయించుకోవటం మొదలు పెట్టాడు. టీకా తీసుకున్న తరువాత టీకా ధృవీకరణ పత్రాన్ని సదరు వ్యక్తులకు ఇచ్చేవాడు. ఇలా ఆ వ్యక్తి తొమ్మిదోసారి వ్యాక్సిన్ కోసం స్థానిక వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చి సిబ్బందికి పట్టుబడ్డాడు.

సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పటకీ ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఇప్పటికీ 8 డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నప్పటికీ అతను పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడంలేదని సమాచారం. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచామని పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top