అంతరిక్షంపై పట్టుకు చైనా యత్నాలు

China County Planning More Than 50 Space Launches 2022 - Sakshi

బీజింగ్‌: ఈ సంవత్సరం 50కి పైగా స్పేస్‌ లాంచ్‌లు జరపాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతోపాటు తన స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆరు సార్లు మానవ సహిత అంతరిక్ష యాత్రలు సైతం ఈ ఏడాది చైనా చేపట్టనుంది. నూతన సంవత్సరం అంతరిక్షంపై పట్టుకు రూపొందించుకున్న విధానాలను చైనా గురువారం ప్రకటించింది. ఈ సంవత్సరం 50కిపైగా స్పేస్‌ లాంచ్‌లతో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపుతామని చైనా ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ డిప్యుటీ చీఫ్‌ మాతో చెప్పారు.

2021లో ప్రపంచమంతా కలిసి 146 స్పేస్‌ లాంచింగ్‌లు జరిగాయి. వీటిలో 48 లాంచింగ్‌లు చైనా చేపట్టినవే కావడం విశేషం. గతేడాది 51 లాంచింగ్‌లతో యూఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైనా స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణంలో ముగ్గురు వ్యోమోగాములు పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌కు పోటీగా చైనా ఈ సీఎస్‌ఎస్‌ (చైనా అంతరిక్ష కేంద్రం)ను నిర్మిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top