మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ నినాదాలు | Another Hindu Temple Attacked With Pro Khalistan Graffiti In USA California Hayward, See Details Inside - Sakshi
Sakshi News home page

Hindu Temple Defaced In US: మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ నినాదాలు

Published Fri, Jan 5 2024 10:21 AM | Last Updated on Fri, Jan 5 2024 1:38 PM

Another Hindu Temple Attacked With Pro Khalistan Graffiti USA - Sakshi

కాలీఫోర్నియా: స్వామినారాయణ గుడి ఘటన మరవకముందే అమెరికాలో మరో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ​ అనుకూల గ్రాఫైట్‌ రాతలు వెలుగు చూశాయి. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక  హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై శుక్రవారం ఖలిస్థానీ గ్రాఫైట్‌ నినాదాలు వెలుగులోకి వచ్చినట్లు హిందూ అమెరికా ఫౌండేషన్‌ (HAF)వెల్లడించింది.  విజయ్ షెరావాలి దేవాలయానికి సంబంధించిన బోర్డుపై ‘మోదీ టెర్రరిస్టు.. ఖలిస్తానీ జిందాబాద్‌’ అని ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు రాశారు. 

అయితే ఈ ఘటనపై విజయ్‌ షెరావాలి దేవాలయం అధికారులు, అల్‌మెడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసినట్టు హెచ్‌ఏఎఫ్‌ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అమ్‌మెడా పోలీసులు తెలిపారు. కాగా.. 2023 డిసెంబర్‌ 23న అమెరికాలోని స్వామినారాయణ గుడిపై గ్రాఫైట్‌తో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: US: పాఠశాలలో కాల్పుల కలకలం


  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement