ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్‌’

The Great Dictator: The film that dared to laugh at Hitler - Sakshi

మహా నియంత హిట్లర్‌పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్‌ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్‌ ఆఫ్‌ ది విల్‌ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్‌స్టాల్‌  రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ హోదా(అనధికారికంగా)తో పాటు,  ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌లో హిట్లర్‌ హస్తం ఉందట. 

ఈ సినిమా నటబృందంలో హిట్లర్‌ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్‌ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్‌ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్‌ ట్రయంప్‌ ఆఫ్‌ ది విల్‌ స్పీచ్‌’గా ఇది బాగా పాప్‌లర్‌ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్‌ కెమెరాలు, ఏరియల్‌ ఫొటోగ్రఫీ, లాంగ్‌–ఫోకస్‌ లెన్స్‌.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్‌... మొదలైన దేశాల్లో అవార్డ్‌లు గెలుచుకుంది. l

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top