ఎంతకు తెగించింది.. తల్లీకొడుకుపై భర్త లవర్‌ యాసిడ్‌ దాడి

Woman Child Injured In Acid Attack By Husband Lover In Maharashtra - Sakshi

నాగ్‍పూర్‌: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్‌ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్‌ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్‌లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్‌ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్‌ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్‌ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. 

‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్‌ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్‌ పోలీస్‌లు తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్‌ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్‌ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top