అల్లునిపై మాజీ ఐపీఎస్‌ నిఘా? | Sakshi
Sakshi News home page

అల్లునిపై మాజీ ఐపీఎస్‌ నిఘా?

Published Sun, May 26 2024 10:28 AM

Karnataka IAS Officer Book case Against Retired IPS Officer

యశవంతపుర: కుటుంబ కలహాలతో మాజీ ఐపీఎస్‌.. ప్రస్తుత ఐఏఎస్‌ అయిన అల్లుని ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించారనేది వివాదమైంది. ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ ఆకాశ్‌ ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఐపీఎస్‌ అధికారి సురేశ్‌ టిఆర్, బెంగళూరులోని హెబ్బగోడి సీఐ ఐయ్యణ్ణరెడ్డితో పాటు ఐదు మందిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

సురేశ్‌ కుమార్తెతోనే ఆకాశ్‌కు పెళ్లయింది. అయితే వజ్రాల వాచ్, బెంజ్‌ కారు, మరింత కట్నం కావాలని వేధిస్తున్నాడని భార్య అతనిపై కేసు పెట్టింది. ఇది కోర్టులో కొనసాగుతోంది. ఇంతలో 2022 ఫిబ్రవరి నుంచి 2023 జనవరి వరకు ఆకాశ్‌ ఫోన్‌ కాల్‌ డేటా రికార్డ్‌ను సీఐ ఐయ్యణ్ణరెడ్డి సేకరించి  వేధించారని ఆకాశ్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక ప్రస్తుత  రేవ్‌ పార్టీ కేసులో సీఐ ఐయ్యణ్ణరెడ్డి నిర్లక్ష్యం చూపారని రూరల్‌ ఎస్పీ చార్జ్‌ మోమో ఇచ్చినట్లు తెలిసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement