రెండేళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేసిన కన్నతండ్రి

Father Assasinate His Two Years Own Child In Moinabad Rangareddy - Sakshi

సాక్షి,రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఒక కన్నతం‍డ్రి తన రెండేళ్ల కొడుకుని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం కట్టుకున్న భార్యను కూడా కత్తితో పొడిచాడు. కాగా బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top