సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం

Accused Tried To Sell The Girl By Lying That He Would Help Her - Sakshi

కర్ణాటక(దొడ్డబళ్లాపురం): ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బెంగళూరు వచ్చిన యువతిని సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి విక్రయించడానికి ప్రయత్నించిన నిందితుడిని కెంపేగౌడ ఎయిపోర్టు పోలీసులు అరెస్టు చేసారు. కోలారుకు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చి మెజెస్టిక్‌లో కూర్చుని ఉండగా ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగేశ్‌ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవనహళ్లికి తీసుకువచ్చాడు. ఆపై యువతిపై అత్యాచారం చేసి తరువాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని పథకం వేశాడు. అయితే ఎయిర్‌పోర్టులో నాగేశ్, యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top