Zoom: జూమ్‌ ఇతరులతో మీ డేటాను పంచుకుంటుందా..! ఎంతవరకు నిజం..!

Zoom Pays Huge Amount To Settle User Privacy Lawsuit In US - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకతో వీడియో సమావేశాల యాప్‌ జూమ్‌ గణనీయంగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడంలో, ఉద్యోగులకు ఆఫీసు కార్యకలాపాలకు జూమ్‌ యాప్‌ ఎంతగానో ఉపయోగపడింది. జూమ్‌ యాప్‌కు పోటిగా పలు దిగ్గజ కంపెనీలు సైతం సమావేశాల కోసం సపరేటుగా యూజర్లకోసం యాప్‌లను తీసుకొచ్చాయి.  ప్రపంచవ్యాప్తంగా జూమ్‌ యాప్‌ను ఎన్నో కోట్ల మంది వాడుతున్నారు. అయితే జూమ్‌ తన యూజర్ల డేటాను ఇతర థర్డ్‌ యాప్స్‌తో పంచుకుంటోందని యూఎస్‌ సంస్థలు నిగ్గుతేల్చాయి.

జూమ్‌ తన యూజర్ల డేటాను ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌, గూగుల్‌, లింక్డిన్‌తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. జూమ్‌ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసింనందుకు గాను యూఎస్‌ న్యాయస్థానం సుమారు 85 మిలియన్‌ డాలర్ల(రూ. 630 కోట్లు)ను జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి జూమ్‌ యాజమాన్యం ఒప్పకున్నట్లు తెలుస్తోంది. జూమ్‌ సరైన భద్రతా పద్ధతులను పాటించక పోవడంతో హ్యాకర్లు జూమ్‌ సమావేశాలను హ్యక్‌ చేయడం సింపుల్‌ అవుతోంది. దీనినే జూమ్‌బాంబింగ్‌ అని అంటారు. జూమ్ బాంబింగ్ అనేది బయటి వ్యక్తులు జూమ్ సమావేశాలను హైజాక్ చేసి, అశ్లీలత ప్రదర్శించడం, జాత్యహంకార భాషను ఉపయోగించడం లేదా ఇతర కలవరపెట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయడం.

కాగా , యూఎస్‌లో కాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్‌ న్యాయమూర్తి లూసీ కో ప్రిలిమినరీ సెటిల్‌మెంట్‌ ఫైల్‌పై ఆమోదం తెలపాల్సి ఉంది. మీటింగ్ హోస్ట్‌లు లేదా ఇతర పార్టిసిపెంట్‌లు మీటింగ్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించినప్పుడు యూజర్లను హెచ్చరించడం, ప్రైవసీ, డేటా హ్యాండ్లింగ్‌పై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణను అందించడం వంటి భద్రతా చర్యలకు జూమ్ అంగీకరించింది. శాన్ జోస్ ఆధారిత కంపెనీ ప్రిలిమినరీ సెటిల్‌మెంట్‌ ఫైల్‌ను పరిష్కరించడానికి అంగీకరించడంలో తన తప్పును ఖండించింది. జూమ్‌ ఆదివారం చేసిన ఒక ప్రకటనలో.. గోప్యత, సెక్యూరిటీ  విషయంలో యూజర్లు మాపై ఉంచే విశ్వాసాన్ని తీవ్రంగా పరిణిస్తామని జూమ్‌ పేర్కొంది.  కోవిడ్‌-19 మహామ్మారి సమయంలో యూజర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top