Reliance Industries: రిలయన్స్‌పై ‘ఈపీఎస్‌’ ఆరోపణలు కొట్టివేత

Sebi Drops Proceedings Against Reliance On Eps Earnings Share - Sakshi

న్యూఢిల్లీ: షేర్‌పై వచ్చే ఆర్జన (ఈపీఎస్‌– ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌) విషయంలో 13 సంవత్సరాల క్రితం ఆర్థిక ఫలితాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై దాఖలైన ఆరోపణలను ‘ఎటువంటి జరిమానా విధించకుండా’ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కొట్టివేసింది. 

దీనికి రెండు అంశాలను సెబీ ప్రాతిపదికగా తీసుకుంది. అందులో ఒకటి... ఒక లిస్టెడ్‌ కంపెనీ ఫలితాల్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తున్న చట్ట సవరణ 2019 మార్చి నుంచీ అమల్లోకి వచ్చింది. 

ఇక సెబీ పేర్కొన్న రెండవ అంశం (గ్రౌండ్‌) విషయానికి వస్తే... ఈ తరహా వివాదం, ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ (శాట్‌) ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. షేర్‌ వారెంట్స్‌ జారీ జరిగినప్పటికీ, 2007 జూన్‌ నుంచి 2008 సెప్టెంబర్‌ వరకూ త్రైమాసిక ఫలితాల స్టేట్‌మెంట్లు ఈపీఎస్‌ను ఒకే విధంగా కొనసాగించాయన్నది ఆర్‌ఐఎల్‌పై ప్రధాన ఆరోపణ.  

చదవండి: వారెన్‌ బఫెట్‌ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబానీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top