రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. గడిచిన సమావేశంతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.
ఇదీ చదవండి: అమెరికా ఇన్‌ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?


