28న హైదరాబాద్‌లో స్టార్టప్ 20–గ్రూప్ సమావేశం

న్యూఢిల్లీ: జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో జనవరి 28న హైదరాబాద్‌లో స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ఆరంభ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో ఎంట్రప్రెన్యూర్‌షిప్, నవకల్పనలకు సంబంధించి విధానపరంగా తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇందులో జీ20 దేశాలకు చెందిన ప్రతినిధులు, అబ్జర్వర్ దేశాల నుంచి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుళపక్ష సంస్థలు .. దేశీ స్టార్టప్ వ్యవస్థ ప్రతినిధులు పలు వురు పాల్గొంటారని వివరించింది. స్టార్టప్20 సదస్సు కార్యక్రమం జూలై 3న జరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ అయిన భార త్ .. వినూత్న అంకుర సంస్థలకు తోడ్పాటునివ్వడంలో సారథ్యం వహించగలదని స్టార్టప్20 ఇండియా చైర్ చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు