విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఆంక్షల్లేవ్‌

Government Permits Airlines To Operate 100 Percent Capacity - Sakshi

విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్‌ని జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి దేశీయంగా విమాణ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభనతో దేశంలో విమాన సర్వీసులపై ఆంక్షలు విధించారు. ప్లైట్‌లో ప్రయాణించాలంటే కోవిడ్‌ నెగటీవ్‌ సర్టిఫికేట్‌, మాస్క్‌ తదితర రక్షణ చర్యలను కట్టుదిట్టం చేశారు. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించే లక్ష్యంతో విమానంలో ప్రయాణికుల పరిమితిపరై ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే కోవిడ్‌ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. 

చివరి సారిగా విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85 సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. తాజాగా ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇకపై విమానాలు వంద శాతం సీటింగ్‌ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్టైట్‌ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది.

చదవండి:ఎయిర్‌లైన్స్‌ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్‌, స్కర్ట్స్‌కి స్వస్తీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top